వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రము పురస్కరించుకొని స్వామివారికి విషెస్ అభిషేకము, మూల మంత్ర హవనము, సుదర్శన హవనము, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.