ఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. వచ్చే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెబుతుంది ఈ ఎకనామిక్ సర్వే.