అన్నదానం ట్రస్ట్‌కు లక్ష విరాళం
NEWS Sep 08,2024 04:04 pm
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం ట్రస్ట్ కు సీతానగరం మండలం చిన్న కొండేపూడికి చెందిన నండూరి వెంకట గంగా రాజశేఖర్ అనే భక్తుడు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ విజయసారధికి అందజేశారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.