పులిని బంధించేందుకు
ట్రాప్ కెమెరాలు, బోనులు ఏర్పాటు
NEWS Sep 08,2024 04:03 pm
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత పులి టెన్షన్ ఇంకా కొనసాగుతుంది. ఆల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద పందిని వెంటాడుతూ కేంద్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దాన్ని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. కదలికలు గుర్తించేందుకు 50 ట్రాప్ కెమెరాలు 4 చోట్ల పెట్టారు. చిరుత కనపడకపోవడంతో రాజమహేంద్రవరం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.