ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు
NEWS Sep 08,2024 04:05 pm
అల్పపీడన ప్రభావంతో ఉప్పాడ సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో ఎగసి పడుతుండడంతో ఆ ప్రాంతమంతా కోతకు గురవుతుంది. బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్లు గోడను సైతం దాటుకుని అలలు ఎగసి పడుతున్నాయి. బీచ్ రోడ్ లో వెళ్లిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు తీర ప్రాంత ప్రజలను ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.