ఏపీలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో బోల్తా కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా బోరన్నగూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరం నుంచి నర్సీపట్నం వెళుతుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 20 మందికి గాయాలైనట్లు సమాచారం.