ఆకట్టుకుంటున్న కళాత్మక చిత్రం
NEWS Sep 08,2024 04:10 pm
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంకి చెందిన ప్రముఖ చిత్రకారుడు సంగీత్ పెన్నుతో గీసిన చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అనే అర్థంతో ఈ చిత్రాన్ని గీశారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ఆ ప్రకృతి మనకు చేరువుగా ఉంటుంది అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని పెయింటింగ్ వేశారు. కళాత్మకంగా చిత్రీకరించడంతో సంగీత్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి.