ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన మంగలి శంకరమ్మ భర్త దత్తయ్య ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇంటి మిద్దె కూలి అకాల మరణం చెందిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. మంగలి శంకరమ్మ (62) కుటుంబానికి అండగా 2 లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించారు. తక్షణ సాయంగా ఆమె అంత్యక్రియలకు అవసరమైన 11 వేల రూపాయలను అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.