పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా వద్ద నీటిలో పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు బీడీఎల్ భానూర్ పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లికి చెందిన పొర్లి నరసప్ప స్క్రాప్ షాపు ఏర్పాటు చేశాడు. వర్షాలతో షాప్ కు తాళం వేసి ఉంచాడు. ఈరోజు షాపు వద్దకు వెళ్లగా ముందు నిలిచిన నీటిలో సుమారు 45 ఏళ్ల వయసు గల మహిళ మృతి చెంది ఉన్నట్లు వివరించారు. ఫిట్స్ కారణంగా నీటిలో పడి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు