జోగిపేటలో కొలువుదీరిన గణనాథులు
NEWS Sep 08,2024 04:15 pm
సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాలతో పాటు, యూత్ ఆధ్వర్యంలో భారీ గణనాథులు కొలువుదీడంతో తొలి పూజలు చేశారు. పట్టణంలోని ప్రతి ఇంటిలో వినాయక పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆదివారం తిరిగి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ విగ్రహాలను దేవాలయాల వద్దకు, స్థానిక చెరువుల వద్ద తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.