నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చించాల గ్రామానికి చెందిన గట్టుపెల్లి సాగర అనే మహిళ ఆదివారం ఇంటి బయట సిలిండర్ పై వంట చేస్తుండగా ఆకస్మికంగా గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంటి బయట వంట చేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.