బాలుడిని గాయపరిచిన వీధి కుక్కలు
NEWS Sep 08,2024 04:19 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పెట్ కాలనీలో ఆదివారం గన్నేరు శ్రీజయ(7) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కలను పట్టుకుని తమను రక్షించాలని కోరుతున్నారు.