మండలంలో పర్యటించిన జిల్లా నోడల్ అధికారి
NEWS Sep 08,2024 04:19 pm
లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్ గ్రామంలో జిల్లా నోడల్ అధికారి భవిష్ మిశ్రా, జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కూలిపోయిన నివాసాలను పరిశీలించారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకుని వారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.