సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు
NEWS Sep 08,2024 04:16 pm
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి సూచించారు. ఆదివారం తెల్లవారుజామున నర్సాపూర్ (జి)లోని రాంపూర్ గ్రామం వద్ద ఓ బొలెరో వాహనంలో పొగలు రావడంతో ఆగిపోయింది. గమనించిన స్థానికులు వారు దొంగలని వాట్సాప్ లో సమాచారం పంపించారు. దీంతో గ్రామస్థులు వారిపై దాడి చేశారు. కాగా వారు దొంగలు కాదని, భైంసాకు చెందిన వారని డీఎస్పీ వెల్లడించారు. అనవసరంగా వదంతులు నమ్మవద్దన్నారు.