కడెం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత
NEWS Sep 08,2024 04:16 pm
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.375 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 10,352 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్న క్రమంలో ప్రాజెక్ట్ 3 గేట్ల ద్వారా 11,550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.