నేరడిగొండ మండలంలోని రోల్ మామడ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న కారు జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి కిందికి పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.