జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణి
NEWS Sep 08,2024 01:38 pm
హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్నారు.