నాగావళీ నదీ ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS Sep 08,2024 01:38 pm
బూర్జ మండలం బూర్జ వద్ద నాగావళి నదీ ప్రవాహాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పరిశీలించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, మరో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి చెరువులు, వాగులు, నదులు కరకట్టలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.