పెన్షనర్స్‌కు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్స్ ఎన్నికల్లో తనకు అండగా నిలిచారని చెప్పారు. వారు అందించిన సహకారం మరువరానిదని అన్నారు. వారికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.