యానాంలోని పుదుచ్చేరిలో హోం శాఖ మంత్రి నమశ్శివాయం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హోంమంత్రి నమశ్శివాయం ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. మల్లాడి కృష్ణారావు నుంచి నమశ్శివాయం దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు.