సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ స్వామివారి జన్మ నక్షత్రము పూజలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రధాన అర్చకులు శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో అష్టోత్తర కళాశాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.