పోలవరం ప్రాజెక్టు 960 మెగావాట్ల విద్యుత్తును అందిస్తుందని రైట్ కెనాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అడపా సంతోష్ అన్నారు. ఆదివారం జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఎమ్మెల్యేకు పోలవరం ఛాయాచిత్రంతో కూడిన జ్ఞాపిక అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు.