విశాఖ-కిరండూల్-విశాఖ
నైట్ ట్రైన్ దారిమళ్ళింపు
NEWS Sep 08,2024 01:43 pm
భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దారిమళ్లించి దంతెవాడ వరకు గమ్యం కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ - కిరండూల్ నైట్ ట్రైన్ (18514) ఈ నెల 8 నుండి 11 వరకు విజయనగరం, రాయగడ, కోరాపుట్ మీదుగా దంతెవాడ చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్ (18513) ఈ నెల 8 నుండి 11 తేదీ వరకు దంతెవాడ నుండి రాయగడ, విజయనగరం మీదుగా విశాఖ చేరుతుందన్నారు.