జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు చేయించాలి
NEWS Sep 08,2024 12:21 pm
అయినవిల్లి మండలంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సమావేశం ఆదివారం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, రాష్ట్ర నేత పాలూరి సత్యానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు పాల్గొన్నారు. యాళ్ల దొరబాబు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతీ నాయకులు అత్యధిక సభ్యత్వాలు చేయించాలని పిలుపునిచ్చారు.