మనోహరాబాద్ మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 13 నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలన చేసినట్లు వివరించారు. ఒక్కొక్క నివాస గృహానికి సహాయంగా రూ. 6500 లు అందజేసేందుకు అర్హుల జాబితాను కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.