కేంద్రం అండగా ఉంటుంది: కిషన్ రెడ్డి
NEWS Sep 08,2024 10:45 am
TG: వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సాయం విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులను ఆదుకునేందుకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.