రావులపాలెం బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
NEWS Sep 08,2024 04:46 pm
రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం బస్సు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. రాయ్ చూర్ నుండి కాకినాడ వెళ్తున్న కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బస్టాండ్ లోకి వస్తూ ఇన్ గేట్ లో మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.