అరకులోయ మండలం లోని లోతేరు, గన్నెల పంచాయితీల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్యలింగం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే లోతేరు, గన్నెల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధులకు మెనూ ప్రకారం ఆహారం అందుతుందో లేదో అన్న కోణంలో రికార్డులను పరిశీలించి వార్డెన్ లకు సూచనలు చేశారు. లోతేరు పాఠశాలలో 140 మంది విద్యార్ధులు మాత్రమే ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరిగినట్టు చర్యలు తీసుకోవాలన్నారు.