ప్రజారోగ్య నిర్లక్ష్యంపై కొప్పుల ఫైర్
NEWS Sep 08,2024 04:40 pm
జగిత్యాల: రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదని, హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఒక్క మంత్రి కూడా క్షేత్రస్థాయిలో వైద్యంపై రివ్యూ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా బెడ్స్, మందులు తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మాజీ జడ్పి చైర్ పర్సన్ వసంత, నాయకులు ఉన్నారు.