టీచర్లతో సర్కార్ తలరాతలే
మారుతయ్: బండి సంజయ్
NEWS Sep 08,2024 04:45 pm
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన గురువందనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉన్నంత కాలం టీచర్ల సమస్యలు తీరవన్నారు. టీచర్లు రోడ్లపైకి వచ్చి కొట్లాడాలి, విద్యార్థుల సమస్యపై గళం విప్పాలని సూచించారు. టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయన్నారు బండి సంజయ్.