అన్నదాన ట్రస్టుకు 4.50 లక్షల విరాళం
NEWS Sep 08,2024 04:59 pm
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు ఉచితంగా అందజేసే అన్నదాన ప్రసాదం ట్రస్టుకు వేములవాడ వాస్తవ్యులు గోలి సరితా తిరుపతి దంపతులు 4 లక్షల 50 వేల రూపాయల విరాళాన్ని అందించారు. అన్నదానం ట్రస్టుకు విరివిగా విరాళాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపు మేరకు విరాళం అందించినట్టు వారు తెలిపారు.