మృతి చెందిన కుటుంబానికి
జెడ్పిటిసి గంగరాజు బాసట
NEWS Sep 08,2024 05:48 pm
అనంతగిరి మండలం ఎగువ శోభ పంచాయతీ కమలాపురం, జాంగుడ మధ్య ప్రవహిస్తున్న వాగు ఉధృతికి గిరిజన మహిళ కొట్టుకుపోయి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో సంఘటన గురించి అనంతగిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కరక రాముకి ఫిర్యాదు చేసారు, అనంతరం పోలీస్ వారి ఆధ్వర్యంలో మహిళ మృతదేహానికి పోస్టుమార్టం, దహన సంస్కరణలో అనంతగిరి జడ్పీటీసీ దిశరి గంగరాజు పాల్గొన్నారు.