శాస్త్రవేత్త అశ్విని మృతికి సంతాపం
NEWS Sep 08,2024 04:52 pm
ఇటీవల భారీ వరదల నేపథ్యంలో మహబూబాబాద్ వాగు ఉదృతికి యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యామని బంజారా గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బానోత్ మంగీలాల్ నాయక్ విచారం వ్యక్తం చేశారు. సోదరుడికి ఉద్యోగం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరో కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దారావత్ గణేష్ నాయక్, రాంబాబు పాల్గొన్నారు.