అరకు: భారీ వర్షాలకు మూతపడిన
పలు పర్యాటక ప్రాంతాలు
NEWS Sep 08,2024 07:38 am
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఐటీడీఏ పిఓ అభిషేక్ ఆదేశాల మేరకు అరకులోయ, డుంబ్రిగూడ మండలాల్లోని పర్యాటక ప్రదేశాలైన గిరిజన మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్, చాపరాయి జలపాతాలను ఈరోజు మూసివేసినట్లు సంబందిత అధికారులు మురళీ, లకే బొంజుబాబు తెలియజేశారు. కావున అరకులోయ వచ్చిన పర్యాటకులు గమనించి సహకరించవలసిందిగా వారు కోరారు.