ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఏపీ సీఎం సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. పవన్ గారు నాకు స్ఫూర్తి. కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది.. అంటూ సుబ్రమణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో ఆఫీసు స్పందించింది. ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.