అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు
NEWS Sep 08,2024 06:54 am
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించవద్దని, మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్ నిర్వహిస్తారని, అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.