డుంబ్రిగూడ ప్రాంతంలో భారీ వర్షం
NEWS Sep 08,2024 06:34 am
డుంబ్రిగూడ మండల కొల్లాపుట్టు పంచాయితీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. శనివారం రాత్రి నుండి వర్షం దంచి కొడుతుంది. నిరంతర వర్షాల కారణంగా గాబుతీత వంటి వ్యవసాయ పనులకు ఆటంకంగా మారిందని రైతులు వాపోతున్నారు. అలాగే కొల్లాపుట్టు టు పంచాయితీలో తారు రోడ్డు కోసం కొన్ని గ్రామాలకు వేసిన గ్రావెల్, రాళ్లు ఈ భారీ వర్షాల కారణంగా కొట్టుకు పోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు.