గోకవరం: చెరువులకు జలకళ
NEWS Sep 08,2024 05:57 am
గోకవరం మండలంలోని చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. వర్షాల కారణంగా చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మండలంలోని తంటికొండ, కొత్తపల్లి, గుమ్మళ్ళదొడ్డి, గోకవరం, రంప ఎర్రంపాలెం గ్రామాల్లోని చెరువులు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ఎక్కడైనా చెరువులు ఓవర్ ఫ్లో అయితే సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు.