ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు శనివారం దాడి చేశారు. మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 162 ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ భాను ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.