ఏపీలో అత్యంత భారీ వర్షాలు
NEWS Sep 08,2024 05:22 am
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో ప.గోదావరి, ఏలూరు అల్లూరి, తూ.గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.