రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోమ్ వైద్యులపై దాడి చేయడం అమానవీయ ఘటనకు నిదర్శనమని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం గోపాలపురంలో ఆయన్ను కలిసి శనివారం ఐఎంఏ సభ్యులు దాడికి సంబంధించి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి డాక్టర్లకు సంఘీభావం తెలియజేశారు.