డుంబ్రిగూడ: ఈ రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పర్యటన కేంద్రమైన డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం రెండు రోజులుగా అధికారులు ఆదేశాల మేరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు చాపరాయి సిబ్బంది ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని కోరారు.