నేడు, రేపు భారీ వర్ష సూచనలు
NEWS Sep 08,2024 05:13 am
తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడతాయని.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.