KMR: ఇంటికి తాళం వేసినా ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. లచ్చపేట గ్రామానికి చెందిన దేవలక్ష్మి తన ఇంటికి తాళం వేసి ఈ నెల 5న కూతురు వద్దకు వెళ్ళింది. శనివారం రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి బీరువాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారం నగదు కనిపించలేదు. దీంతో భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై అనిల్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.