మెదక్ జిల్లా టేక్మాల్ లో అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి వృద్ధురాలు మంగలి మంగలి శంకరమ్మ (68) మృతి చెందింది. మంగలి దత్తయ్య, శంకరమ్మ దంపతులు రాత్రి వేరువేరు గదుల్లో నిద్రించారు. భారీ వర్షాలతో గోడలు నాని ఇంటి పైకప్పు కూలింది. పై కప్పు మంగలి శంకరమ్మ పై పడడంతో మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.