లోయర్ మానేరు డ్యాంలో 20.464 టీఎంసీల నీరు నిల్వ
NEWS Sep 08,2024 04:06 am
కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో మిడ్ మానరు నుంచి నీటి విడుదల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం డ్యాం సామర్థ్యం 24.034 టిఎంసిలు, 920.00 అడుగులకు గాను 20.464 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలోని మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి 2, 938 క్యూసెక్కుల నీరు ఎగువ మానేరు నుంచి వస్తుంది. 297 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాల నిమిత్తం కింది భాగానికి విడుదల చేస్తున్నారు.