మల్యాల: కొలువుదీరిన గణనాథులు
NEWS Sep 08,2024 04:06 am
మల్యాల మండలంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు వినాయకులను బ్యాండ్ మేళాలతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంవత్సరం ఆయా గ్రామాల్లో ప్రజలు ఎక్కువ శాతం మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు మొగ్గు చూపారు.