ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని కాంగ్రెస్ కూటమి యత్నిస్తోంది
NEWS Sep 08,2024 04:13 am
జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను ఇవ్వాలని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగ్రవాదులతో లింకులున్న పార్టీలతో జత కట్టి మళ్లీ 370 ఆర్టికల్ ను తీసుకొచ్చి ఉగ్రవాద హోదాను పునరుద్దరించాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోంది. దేశ ప్రజలారా ఆలోచించండి. జమ్మూకాశ్మీర్ ప్రజలకు మీరంతా అప్పీల్ చేయండి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో టవర్ సర్కిల్ వద్దమండపాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు.