AP: విశాఖపట్నంలోని 37వార్డులో వినాయక చవితి సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన గణేషుడి ప్రతిమలు తెగ వైరలవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని చెప్పేలా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లా ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.