ముంబైలో GSB సేవా మండల్ ఏర్పాటు చేసిన మహాగణపతి మండపానికి, అలంకరణకు పెట్టిన ఖర్చు.. చేసిన ఏర్పాట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. రూ.400 కోట్లతో నిర్వాహకులు ఇన్సూరెన్స్ చేయించారు. గణపయ్యను ఏకంగా 66 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు. అలంకరణలో 325 కిలోల వెండి ఆభరణాలు కూడా ఉపయోగించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఈ వేడుకలకు 400 కోట్లతో బీమా చేయించారు. 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తారు.